తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Margaret Alva's Phone Tapped? : ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఫోన్ ట్యాపింగ్‌?

Margaret Alva's phone tapped? : ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఫోన్ ట్యాపింగ్‌?

26 July 2022, 18:52 IST

Margaret Alva's phone tapped? : విప‌క్షాలు ఉమ్మ‌డిగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ‌రిలో నిలిపిన మార్గ‌రెట్ అల్వా కేంద్ర ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోటీలో నిలిచిన త‌రువాత త‌న ఫోన్‌ను ట్యాప్ చేశార‌ని, త‌న కాల్స్‌ను `పెద్ద‌న్న‌` వింటున్నార‌ని ఆమె ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీలో ఉన్న కొంద‌రు మిత్రుల‌కు ఫోన్ చేశాన‌ని, అప్ప‌టి నుంచి త‌న ఫోన్ ట్యాప్ అయింద‌ని ఆరోపించారు. త‌న ఫోన్‌కు స‌ర్వీసెస్ నిలిచిపోయాయ‌ని, త‌న మొబైల్ నుంచి ఎవ‌రికీ ఫోన్ చేయ‌లేకపోతున్నాన‌ని, కాల్స్ రిసీవింగ్ కూడా నిలిచిపోయింద‌ని తెలిపారు. త‌న మొబైల్‌కు వ‌చ్చే కాల్స్‌ను డైవ‌ర్ట్ చేశార‌ని ఆరోపించారు. వెంట‌నే త‌న మొబైల్ ఫోన్ స‌ర్వీసెస్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఎంటీఎన్ఎల్‌ను కోరారు. ఇక‌పై ఏ బీజేపీ, టీఎంసీ, బీజేడీ ఎంపీల‌కు ఫోన్ చేయ‌న‌ని ప్రామిస్ చేస్తున్నాన‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం విప‌క్ష నేత‌లంతా ట్యాపింగ్ భ‌యంతో బ్ర‌తుకుతున్నార‌ని, ఒక‌టికి మించి ఫోన్‌లు వాడుతున్నార‌ని, ఫోన్‌కాల్స్‌ను కూడా భ‌యంభ‌యంగా అటెండ్ చేస్తున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, మార్గ‌రెట్ అల్వా చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ తోసిపుచ్చింది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆమెకు అర్థ‌మై, ఇలాంటి అర్థంప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా ఎదురుదాడి చేశారు. పూర్తి వివ‌రాలు ఈ వీడియోలో చూడండి..