తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pilot Alert | పైల‌ట్ అల‌ర్ట్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

pilot alert | పైల‌ట్ అల‌ర్ట్.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

16 June 2022, 17:27 IST

 పైల‌ట్ చూపిన స‌మ‌య‌స్ఫూర్తి ఆకాశంలో పెను ప్ర‌మాదాన్ని త‌ప్పించింది. వంద‌లాది ప్రాణాల‌ను కాపాడింది. సేఫ్ ల్యాండింగ్ త‌రువాత ఆ పైల‌ట్ పై అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. లండన్ నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానం అంకారా ఏటీసీ(air traffic control) ప‌రిధిలోకి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో 33 వేల ఫీట్ల ఎత్తులో ఆ విమానం ప్ర‌యాణిస్తోంది. ఇంతలో, అంకారా ఏటీసీ నుంచి పైల‌ట్‌కు ఒక సూచన వ‌చ్చింది. విమానం ఎత్తును 33 వేల ఫీట్ల నుంచి 35 వేల ఫీట్ల‌కు తీసుకువెళ్లాల‌ని ఆ ఏటీసీ పైల‌ట్‌కు సూచించింది. అయితే, కేవ‌లం 15 మైళ్ల దూరంలో 35 వేల ఫీట్ల ఎత్తులో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం వేగంగా వ‌స్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పైల‌ట్ ఏటీసీ సూచ‌న‌ను ప‌ట్టించుకోకుండా, 33 వేల ఎత్తులోనే విమానాన్ని న‌డిపాడు. ఆ త‌రువాత‌, త‌ప్పు తెలుసుకున్న ఏటీసీ.. అదే ఎత్తును కొన‌సాగించాల‌ని కోరింది. కానీ, ఒక‌వేళ‌, పైలట్‌గా అప్ర‌మ‌త్తంగా లేన‌ట్ల‌యితే, ఏటీసీ సూచ‌న‌ల‌ను గుడ్డిగా అనుస‌రిస్తే.. ఆ రెండు విమానాలు ఢీ కొనేవి. దాంతో ఆకాశంలో పెను విధ్వంసం జ‌రిగేది. రెండు విమానాల్లోని 600 మంది ప్రాణాలు గాల్లోనే క‌లిసిపోయేవి. పైల‌ట్ స‌మ‌య‌స్ఫూర్తి, అప్ర‌మ‌త్త‌త‌తో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది.