తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rupee Notes On Singer | పాటలకు కురిసిన డబ్బుల వర్షం

rupee notes on singer | పాటలకు కురిసిన డబ్బుల వర్షం

13 March 2023, 19:39 IST

  • గుజరాత్‌కు చెందిన ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిసింది. ఫోక్ సింగర్ కీర్తిదన్ గధ్వీ భజన సమయంలో పాడిన పాట విని ముగ్ధులైన భక్తులు ఒక్కసారిగా నోట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సద్‌లో చోటు చేసుకుంది. వల్సద్ అగ్నివీర్ గో సేవా దళ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాటలు పాడారు. ఈ పాటలకు ముగ్దులైన చుట్టూ ఉన్న వారు ఒక్కసారి ఆయనపై నోట్లు వెదజల్లారు. మొత్తం వేదిక అంతా కరెన్సీ నోట్లతో నిండిపోయింది. నిజానికి గుజరాత్‌లో ఇదో ట్రెండ్‌ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.