తెలుగు న్యూస్  /  Video Gallery  /  Man Kissed To Police

man kissed to police | బరాత్ లో పోలీసు అధికారికి ముద్దు పెట్టిన యువకుడు

16 March 2023, 15:03 IST

  • అప్పుడప్పుడు చిత్ర చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇటీవల బీహార్ లో ఓ యువకుడు నడి రోడ్డుపై ఓ వివాహితకు ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా అయ్యింది. ఇప్పుడు ఓ చోట బరాత్ జరుగుతోంది. ఈ బరాత్ లో చాలా మంది యువకులు ఎంతో ఉత్సాహంగా డాన్స్ లు చేస్తున్నారు. అందులో ఉన్న ఓ యువకుడు డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడాలన్నట్లు దగ్గరకు పిలిచాడు. ఇదే సమయంలో ఆ యువకుడు అందరూ చూస్తుండగా పోలీసుకు ముద్దు పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే కోపంతో ఆ పోలీస్ ఆ యువకుడిపై కళ్లు ఎర్రజేసి చేశారు. ఇదంతా స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.