తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మేడ్-ఇన్-ఇండియా.. పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం!

మేడ్-ఇన్-ఇండియా.. పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం!

25 August 2022, 20:34 IST

రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌ నుండి పినాకా ఎక్స్‌టెండెడ్ రేంజ్ రాకెట్ ట్రయల్స్‌ను DRDO విజయవంతంగా నిర్వహించింది. సైన్యం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్లను అభివృద్ధి చేశారు . ఈ పరీక్షలకు సంబంధించిన 28-సెకన్ల స్లో-మోషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్మీ, డిఆర్‌డిఓ అధికారుల సమక్షంలో ఈ టెస్ట్ ఫైర్ జరిగింది. 15 అడుగుల పొడవైన క్షిపణి అడ్వాన్స్ నావిగేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నిర్దేశించిన ప్రమాణం ప్రకారం లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.