తెలుగు న్యూస్  /  Video Gallery  /  Lovers Romance On Bike

Lovers Romance | రోడ్డుపై రొమాన్స్... రంగంలోకి పోలీసులు

09 March 2023, 20:16 IST

  • ఈ మధ్యకాలంలో బైక్ పైన స్టంట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జంటల బైక్ స్టంట్స్, కదులుతున్న వాహనంపై రొమాన్స్ చేసే వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. వీటిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పోలీసులు మాత్రం రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ యువ జంట కదులుతున్న ద్విచక్ర వాహనంపై రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అరెస్టు చేశారు. తాజాగా అలాంటి మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ సందర్భంగా జైపూర్ వీధుల్లో ఒక జంట బుల్లెట్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.