తెలుగు న్యూస్  /  Video Gallery  /  Lanka Paying For China's Colonization By Debt; Ex-niti Aayog Vice Chair Flags Dubious Investments

China behind Sri Lanka crisis | శ్రీలంక సంక్షోభం వెనుక చైనా?

15 July 2022, 19:13 IST

China behind Sri Lanka crisis | శ్రీలంక ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న దారుణ ప‌రిస్థితుల‌కు చైనా కార‌ణ‌మా? ద్వీప‌దేశం ఎదుర్కొంటున్న ఈ తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభం చైనా పుణ్య‌మేనా? అంటే అవున‌నే అంటున్నారు భార‌త నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్య‌క్షుడు, ప్ర‌ముఖ ఆర్థిక వేత్త అర‌వింద్ ప‌న‌గ‌రియా. చైనా న‌యా వ‌ల‌స‌వాద విధానంలో భాగ‌మై.. శ్రీలంక తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని వివ‌రించారు. చైనా చేప‌ట్టిన బెల్ట్ అండ్ రోడ్‌(Belt and Road Initiative -BRI) లో శ్రీలంక కూడా భాగ‌మే. చైనాతో వివిధ భూభాగాల‌ను అనుసంధానించే ప్ర‌ణాళికే ఈ BRI.

 

China behind Sri Lanka crisis |

ప‌న‌గ‌రియా విశ్లేష‌ణ ప్ర‌కారం.. రాజ‌ప‌క్స కుటుంబం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చైనా నుంచి భారీగా, అధిక వ‌డ్డీల‌కు రుణాల‌ను తీసుకున్నారు. చైనా ఇచ్చే రుణాల‌కు వ‌డ్డీలు, యూరోప్ దేశాలు, అమెరికా, ఇత‌ర అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు ఇచ్చే వ‌డ్డీ రేటుక‌న్నా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. రుణాల‌ను రీపే చేయ‌లేని ప‌రిస్థితుల్లోకి ఆయా దేశాలు వెళ్లిన త‌రువాత‌, త‌న స్ట్రాటెజీని చైనా అమ‌లు చేస్తుంది. ఆయా దేశాల్లో వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన కేంద్రాల‌ను చైనా స్వాధీనం చేసుకుంటుంది. ఆ కేంద్రాల్లో ప్ర‌ధాన‌మైన‌వి ఆయా దేశాల్లోని నౌకాశ్ర‌యాలు. శ్రీలంక‌లోని కీల‌క‌మైన హంబ‌న్‌టోటా పోర్ట్ ను చైనా అలాగే, 99 ఏళ్ల‌కు లీజుకు తీసుకుంది. వివిధ దేశాల‌పై ఆధిప‌త్యం సాధించేందుకు చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ రూపొందించిన ప్ర‌ణాళిక‌ల్లో ఇదొక కీల‌క‌ భాగం.