తెలుగు న్యూస్  /  Video Gallery  /  Kim Jong-un Dares U.s, Flexes Military Muscle; Vows To Boost Nuclear Arsenal

Video: అలా చేస్తే అణుదాడులు చేస్తాం.. కిమ్ సీరియస్ వార్నింగ్

27 April 2022, 10:19 IST

అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత వేగంగా బలపర్చుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ స్పష్టం చేశారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణుదాడికి సిద్ధమేనని తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయుధాల పరేడ్‌ నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో  శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. ఇందులో హ్వాసాంగ్‌–17 క్షిపణి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్‌.. తన భార్య రి సోల్‌ జూతో కలిసి ఈ పరేడ్‌ని తిలకించారు. మరిన్ని వివరాల కోసం వీడియో వీక్షించండి.