తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Space Sector | భారతీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్‌లకు అధికారం!

Indian Space Sector | భారతీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్‌లకు అధికారం!

28 June 2022, 15:11 IST

భారతీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) రెండు భారతీయ స్టార్టప్‌లకు కొత్తగా అధికారం కల్పించింది. హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే బెంగళూరుకు చెందిన దిగంతరా రీసెర్చ్ & టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు తమ పేలోడ్‌లను ప్రారంభించేందుకు ఇప్పుడు IN-SPACe ద్వారా అధికారం పొందాయి. భారతదేశంలో 100కి పైగా స్పేస్ స్టార్టప్‌లు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ సెక్టార్ లాంచ్‌తో భారతీయ అంతరిక్షం మరింత ఎత్తుకు ఎదుగుతుందని మోదీ పేర్కొన్నారు. జూన్ 30న ప్రయోగించాల్సి ఉన్న PSLV-C53 PSLV ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)లో ప్రైవేట్ పేలోడ్‌లు నింగికెగరనున్నాయి.