తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rss Invites Woman As Chief Guest: మారుతున్న ఆరెస్సెస్ తీరు

RSS invites woman as chief guest: మారుతున్న ఆరెస్సెస్ తీరు

05 October 2022, 20:53 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలిసారి ఒక మహిళను తమ దసరా కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆహ్వానించింది. హిమాలయాల్లోని ఎవరెస్ట్ పర్వతాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి మహిళ అయిన సంతోష్ యాదవ్ ఈ సారి నాగపూర్ లో జరిగిన దసరా ర్యాలీలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సంతోష్ యాదవ్ ఐటీబీపీలో విధులు నిర్వర్తిస్తూ, పర్వతారోహణపై ఆసక్తితో ఎవరెస్ట్ ను రెండు సార్లు అధిరోహించారు. 1992లో ఎవరెస్ట్ ను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్లను ఈ వీడియోలో చూడండి..