తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  I-day Celebrations: అమృతోత్సవాన ఐఏఎఫ్ హెలిక్యాప్టర్ల పూల వర్షం

I-Day celebrations: అమృతోత్సవాన ఐఏఎఫ్ హెలిక్యాప్టర్ల పూల వర్షం

15 August 2022, 12:40 IST

I-Day celebrations: ప్రధానమంత్రి ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు అమృతోత్సవాలను గుర్తు చేస్తూ పూల వర్షం కురిపించాయి. రెండు Mi-17 1V IAF హెలికాప్టర్లు ఎర్రకోట వద్ద పూల రేకులను కురిపించాయి. వేడుకలకు హాజరైన వారు ఈ దృశ్యాలు తిలకిస్తూ హర్షధ్వానాలు పలికారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ హెలికాప్టర్లు 2021లో మొదటిసారిగా పూల రేకులను కురిపించాయి. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఛాపర్స్ మళ్లీ పూరెమ్మల వర్షం కురిపించాయి. ఆ దృశ్యాలు మీరూ చూడండి.