తెలుగు న్యూస్  /  Video Gallery  /  Horrific Attack On China Restaurant

న్యూయార్క్ లోని ఓ రెస్టారెంట్ లో భీభత్సం సృష్టించిన ఆకతాయిలు

09 March 2023, 15:09 IST

  • అమెరికాలో ఓ చైనీస్ రెస్టారెంట్ పై దాడి జరిగింది. ముసుగులో వచ్చిన కొందరు దుండగులు రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దాడికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఉద్యమకారిణి యియాటిన్ చూ తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. టేబుళ్లను కిందపడేసి, పాత్రలను పగలకొట్టి, కుర్చీలను విరగొట్టారు. విధ్వంసానికి పాల్పడిన దుండగులు, చివరికి సిబ్బందిని సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది స్థానిక యువతగా తెలుస్తోంది. అయితే వాళ్ల ఆచూకీని ఇంకా పోలీసులు కనిపెట్టలేదు. న్యూయార్క్ లోని క్వీన్స్ లోని ఫిష్ విలేజ్ రెస్టారెంట్లో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.