తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'Gatherer Of Russian Lands': దూకుడు పెంచిన రష్యా.. ఉక్రెయిన్​లోకి సైన్యం ఎంట్రీ!

'Gatherer of Russian lands': దూకుడు పెంచిన రష్యా.. ఉక్రెయిన్​లోకి సైన్యం ఎంట్రీ!

23 February 2022, 10:10 IST

ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ రష్యా నిర్ణయం తీసుకుంది. అక్కడకు తమ బలగాలను పంపుతోంది. వేర్పాటువాదులు యుద్ధట్యాంకులు, బలగాలు డొనెట్స్‌క్‌కు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిపై మాత్రం ఎలాంటి గుర్తులు లేవు. రష్యా చర్యలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు ఉక్రెయిన్ దళాలు ఎలా స్పందిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు చెప్పారు. దేనికీ భయపడబోమని.. తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకోమని తెలిపారు. ఉక్రెయిన్‌ను తమ వారసత్వానికి సంబంధించినదిగా 'రష్యన్ భూముల సేకరణ'గా చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను చూడండి.