farmers protest | సమస్యలు పరిష్కరించాలని దిండోరి నుంచి ముంబయి వరకు మార్చ్

16 March 2023, 16:48 IST

  • మహారాష్ట్రలో రైతులు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ రైతులు, గిరిజనులు నాసిక్​ జిల్లాలోని దిన్దోరి టౌన్​ నుంచి మార్చ్ మొదలుపెట్టారు. ఈ భారీ ర్యాలీలో వేలాది మంది రైతులు, గిరిజనులు పాల్గొన్నారు. ధర దారుణంగా పడిపోవడంతో ఉల్లి రైతులకు క్వింటాల్​కు రూ.600 తక్షణ సాయం, 12 గంటల పాటు కరెంట్​ సరఫరా, వ్యవసాయ రుణాల రద్దు తదితర డిమాండ్లతో ఈ మార్చ్ మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నుంచి ముంబై వైపు కవాతు చేస్తున్న రైతులు, గిరిజనులు థానే జిల్లాలోకి ప్రవేశించినప్పుడు, మంత్రులు దాదా భూసే, అతుల్ సవే బుధవారం అర్థరాత్రి రైతుల ప్రతినిధి బృందాన్ని కలిశారు.