తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ed Raids 44 Locations Of Chinese Smartphone Maker Vivo In Money Laundering Case : Firm Responds

Vivo money laundering |భార‌త్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ `వివో` మనీ లాండ‌రింగ్‌

05 July 2022, 20:41 IST

 భార‌త్‌లో చైనా మొబైల్స్‌కు ఉన్న భారీ డిమాండ్ మ‌రే మొబైల్ ఫోన్స్‌కు ఉండ‌దు. స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ఎక్కువ ఫీచ‌ర్స్ ఇచ్చే మొబైల్స్ అన్నీ చైనావే కావ‌డం గ‌మ‌నార్హం. అలాంటి మొబైల్స్‌లో ఒక‌టి వివో(Vivo). తాజాగా, ఆ సంస్థకు సంబంధించి, భార‌త్‌లోని కార్యాల‌యాల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ దాడులు చేసింది. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, మేఘాల‌య‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌ల్లోని 44 ప్లేసెస్‌లో మంగ‌ళ‌వారం ఏక‌కాలంలో ఈ దాడులు నిర్వ‌హించింది. మ‌నీ లాండ‌రింగ్‌కు సంబంధించి వివో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. రాయ‌ల్టీ పేమెంట్ల పేరుతో న‌గ‌దు అక్ర‌మ చెలామ‌ణికి పాల్ప‌డుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టికే మ‌రో చైనా దిగ్గ‌జ సంస్థ `షావోమీ` భార‌త కార్య‌క‌లాపాల‌పై కూడా ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించింది. చైనాకు చెందిన బీబీకే ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ వివో పేరెంట్ సంస్థ‌. వివోతో పాటు వ‌న్‌ప్ల‌స్‌, రియ‌ల్‌మీ, ఒప్పో, ఐక్యూ మొద‌లైన బ్రాండ్లు కూడా బీబీకేకు చెందిన‌వే.