తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వైరల్ వీడియో: కెనడా ఎంపీ ప్రసంగానికి నెటిజన్లు ఫిదా

వైరల్ వీడియో: కెనడా ఎంపీ ప్రసంగానికి నెటిజన్లు ఫిదా

20 May 2022, 17:11 IST

  • కర్ణాటకలో పుట్టిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య కన్నడలో కెనడియన్ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆయన ప్రసంగం నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. ఆర్య తన మాతృభాష కన్నడలో ప్రసంగించారు. కెనడా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఒంటారియోలోని నేపియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్య, కన్నడ ఐదు కోట్ల మంది ప్రజలు మాట్లాడే అందమైన భాష అంటూ తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోపై రాజకీయ నాయకులతో పాటు నెటిజన్లు ఆర్యను ప్రశంసించారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.