తెలుగు న్యూస్  /  Video Gallery  /  Chandani Chowk Bridge Demolished In Pune

Bridge Demolish: 6 సెకన్లలోనే చాందినీ చౌక్ బ్రిడ్జ్ నేలమట్టం - వీడియో ఇదిగో

02 October 2022, 11:57 IST

  • Chandani Chowk Demolish in Maharashtra: మహారాష్ట్ర పూణెలోని ఓ పాత వంతెనను కూల్చివేశారు. రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జిని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా నేలమట్టం చేశారు. నియంత్రిత పేలుడు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ట్విన్ టవర్లను కూల్చినప్పుడు ఉపయోగించిన సాంకేతికతనే ఇక్కడా ఉపయోగించారు. ‘చార్జింగ్’ విధానంలో బ్రిడ్జిపై పేలుడు పదార్థాలను అమర్చారు. ఆపై వాటిని పేల్చడంతో పెద్ద శబ్దంతో బ్రిడ్జి కుప్పకూలింది.యూపీలో 100 మీటర్లకుపైగా ఎత్తున్న ట్విన్ టవర్లను కూల్చివేసేందుకు 9 సెకన్ల సమయం పట్టగా, పూణె బ్రిడ్జి కూల్చివేతకు 6 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీనే ఈ కూల్చివేతలను కూడా చేపట్టింది. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..