తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  British Policeman's Dance | ఇండియన్స్ తో కలిసి బ్రిటీష్ పోలీసుల డాన్సు అదరహో

British policeman's dance | ఇండియన్స్ తో కలిసి బ్రిటీష్ పోలీసుల డాన్సు అదరహో

22 March 2023, 17:11 IST

లండన్‌లో హై కమిషన్‌ భవనంపై నుంచి ఖలిస్తాన్‌ అనుకూల ఆందోళనకారులు భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తను పిలిపించిన భారత విదేశాంగ శాఖ తన నిరసన తెలియచేసింది. ఇక లండన్ లోని భారతీయులు, భారతీయ మద్దతుదారుల భారత హై కమిషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తారు. డ్యాన్సు చేస్తూ తమ ఆందోళన తెలియజేశారు. ఈ క్రమంలో లండన్ పోలీసులు కూడా వారితో కలిసి డాన్సు చేశారు. తమ మద్దతు తెలిపారు.