తెలుగు న్యూస్  /  Video Gallery  /  Blazing Light Trail Cuts Through Sky In Maharashtra & Mp; Meteor Shower Or Chinese Rocket Re-entry?

Video: మహారాష్ట్రలో పడింది ఉల్కలు కాదా.. చైనా రాకెటా...?

03 April 2022, 11:40 IST

మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో శనివారం రాత్రి ఉల్కాపాతం కనిపించింది. ఆకాశం నుంచి ఉల్కలు జారుతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లలో బంధించారు. అయితే ఇది ఉల్కాపాతం కాదని.. చైనాకు చెందిన రాకెట్ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణం..  అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ చేసిన ట్వీటే. గతేడాది ఫిబ్రవరిలో చైనా ప్రయోగించిన రాకెట్‌ కి సంబంధించనదేమో అని అభిప్రాయపడ్డారు. ఇక స్కై వాచ్ గ్రూప్ స్పందిస్తూ... ఇది శాటిలైట్ కు సంబంధించిన ఈవెంట్ అయి ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.