తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rss Rammadhav Warns Govt | `చైనాతో తొంద‌ర‌పాటు వ‌ద్దు`

RSS RamMadhav warns Govt | `చైనాతో తొంద‌ర‌పాటు వ‌ద్దు`

15 June 2022, 17:47 IST

  • ఆరెస్సెస్ నేత రామ్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్యను ప‌రిష్క‌రించే విష‌యంలో తొంద‌ర‌పాటు కూడ‌ద‌ని సూచించారు. `నా హ‌యాంలోనే ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌`న్న తొంద‌ర‌పాటు ధోర‌ణి స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. `నేనే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాన‌ని చ‌రిత్ర గుర్తుంచుకోవాలి` అనే ధోర‌ణి ప‌నికిరాద‌ని హెచ్చ‌రించారు. రామ్‌మాధ‌వ్ వ్యాఖ్య‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన‌వేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. క‌ల్న‌ల్ అనిల్ భ‌ట్ రాసిన `చైనా బ్ల‌డీస్ బుల్లెట్‌లెస్ బార్డ‌ర్స్‌` అనే పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో రామ్ మాధ‌వ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనాతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ఎవ‌రు ప‌రిష్క‌రిస్తార‌న్న‌ది చ‌రిత్రే చెబుతుంద‌ని రామ్ మాధ‌వ్ వ్యాఖ్యానించారు. `చైనాతో ర‌ష్యా దేశానికి ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను బోరిస్ ఎల్త్సిన్ అనే తాగుబోతు ర‌ష్యా ప్రెసిడెంట్ ప‌రిష్క‌రించిన విష‌యం గుర్తుంచుకోవాలి. బోరిస్ ఎల్త్సిన్ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌ గ‌ల‌డు అని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఆయ‌న అది సాధించారు. చ‌రిత్ర‌లో నిలిచారు` అని రామ్‌మాధ‌వ్ వ్యాఖ్యానించారు. ``చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య అంత సుల‌భంగా ప‌రిష్కారం కాదు. ఎందుకంటే ఆ స‌మ‌స్యపై పోరాడాల్సింది చైనా అనే ఒక దేశంతో కాదు.. ఒక నాగ‌రిక‌త‌తో, ఒక సాంస్కృతిక జాతితో` అని హెచ్చ‌రించారు. రామ్ మాధ‌వ్ `అనీజీ నైబ‌ర్స్‌.. ఇండియా అండ్ చైనా ఆఫ్ట‌ర్ 50 ఈయ‌ర్స్ ఆఫ్ ది వార్‌` అనే పుస్త‌కం కూడా రాశారు. 2019 వ‌ర‌కు బీజేపీ జ‌మ్మూక‌శ్మీర్ ఇన్ చార్జ్‌గా కూడా రామ్ మాధ‌వ్ వ్య‌వ‌హ‌రించారు.