తెలుగు న్యూస్  /  Video Gallery  /  Bihar Thief Swings From Train Window As Passengers Grasp Arms Video Viral

Viral video: రైలు కిటికీలోంచి ఫోన్ చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు

17 September 2022, 15:21 IST

  • Thief swings from train window: ఓ దొంగ రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలులో మొబైల్‌ ఫోన్‌ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. బిహార్ లోని ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. మొబైల్‌ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్‌ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. లోపలి ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీడియోని చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి……