తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Army Men Helping | అర్ధరాత్రి సమయంలో ఓ కుటుంబాన్ని ఆదుకున్న ఆర్మీ జవాన్

army men helping | అర్ధరాత్రి సమయంలో ఓ కుటుంబాన్ని ఆదుకున్న ఆర్మీ జవాన్

20 March 2023, 17:31 IST

  • ప్రస్తుతం ఆర్మీ జవాన్ల మంచి మనసుని తెలిపే ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రజల హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ఆర్మీ సైనికులు అర్థరాత్రి కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఓ రహదారిపై వెళ్తుండగా బైకు చెడిపోయింది. అయితే అటుగా వెళ్తున్నవారు వీరిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.ఇంతలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు, రోడ్డు పక్కన నిలబడిన ఫ్యామిలీని చూసి ఆగారు. బైక్ ను మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.బైక్ స్టార్ట్ కాలేదు. ఇక ఆ జవాన్ తన బైక్‌ను ఆ కుటుంబానికి ఇచ్చి వారి చిరునామాను తీసుకున్నారు.దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.