తెలుగు న్యూస్  /  Video Gallery  /  Actress, Bjp Mp Hema Malini Into Another Controversy

Hema Malini: మరో వివాదంలో హేమమాలిని

24 September 2022, 21:21 IST

Hema Malini: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని మథుర నియోజకవర్గం ఎంపీ గా ఉన్న హేమమాలిని సహ నటి సన్నీ లియోన్ ను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మథుర నుంచి బాలీవుడ్ నటి కంగన రనౌత్ పోటీ చేయనున్నారన్న వార్తలపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. ‘రేపు సన్నీ లియోన్ కూడా పోటీ చేస్తా అని వస్తుంది’ అంటూ హేమ మాలిని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు హేమ మాలినిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్య సన్నీ లియోన్ ను అవమానించేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..