తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Double Decker Buses : హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు.. నడిచే రూట్ లు ఇవే..

Double Decker Buses : హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు.. నడిచే రూట్ లు ఇవే..

07 February 2023, 20:43 IST

  • Double Decker Buses : హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సుల సందడి మొదలైంది. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 7న ప్రారంభించారు. ఈ నెల 11 నుంచి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ రూట్లలో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకి సేవలు అందించనున్నాయి. 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులకి హెచ్ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా.. ప్రస్తుతానికి 3 అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 3 బస్సులు రానున్నాయి. హైదరాబాద్ లో 20 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.