తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Holi Celebrations: వేడుకగా ‘లడ్డూ మార్ హోలీ’.. లడ్డూలు విసురుకుంటూ సంబరాలు

Holi Celebrations: వేడుకగా ‘లడ్డూ మార్ హోలీ’.. లడ్డూలు విసురుకుంటూ సంబరాలు

28 February 2023, 15:16 IST

  • Holi Celebrations: ఉత్తర ప్రదేశ్‍లో అప్పుడే హోలీ సందడి మొదలైంది. హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు మథురకు పర్యాటకులు అధికంగా వస్తుంటారు. సంబరాల్లో భాగంగా ఫిబ్రవరి 27న మథురలో ‘లడ్డూ మార్ హోలీ’ వేడుకలు ఘనంగా జరిగాయి. బర్సానా నగరంలో ప్రజలు ఒక్క చోట చేరి రంగులను చల్లుకుంటూ వేడుక చేసుకున్నారు. లడ్డూలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఆ తర్వాత ఆ లడ్డూలను ప్రసాదంగా తీసుకుంటారు. హోలీ వేడుకల్లో నృత్యాలతో హోరెత్తించారు యువత. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‍లోని కొన్ని ప్రాంతాల్లో 9 రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి.