తెలుగు న్యూస్  /  Video Gallery  /  Taiwan's Same-sex Marriage Law Not For All

Same-sex Marriage । ఆ దేశంలో స్వలింగ వివాహానికీ చట్టబద్ధత.. కానీ ఒక షరతు!

29 June 2022, 20:10 IST

  • తైవాన్ ప్రభుత్వం తమ దేశంలో మూడు సంవత్సరాల క్రితమే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసింది. ఏసియా ఖండంలోనే స్వలింగ వివాహాలకు గుర్తింపునిచ్చిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అయితే ఈ చట్టబద్ధత అందరికీ వర్తించడం లేదు. ఇతర దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి చట్టపరమైన అడ్డంకుల ఎదురవుతున్నాయి. దీంతో అనేక జంటలు అక్కడ చాలా సంవత్సరాల పాటు వివాహం అనేదే లేకుండా సహజీవనం చేస్తూ అనిశ్చితిలో జీవిస్తున్నారు. లూయిస్ అనే తైవాన్ మహిళ హాంగాంక్ కు చెందిన కిమ్మీ అనే మహిళతో ప్రేమలో పడింది. కానీ స్వలింగ వివాహానికి అంగీకరించే దేశంలో ఏసియాలో ఇప్పటివరకు లేదు. కానీ 2019లో తైవాన్ వివాహానికి చట్టబద్ధత కల్పించడంతో ఈ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే స్వదేశంలో ఉన్నవారిని మాత్రమే చేసుకుంటే వారి స్వలింగ వివాహానికి హక్కులు కల్పిస్తామని చెప్పడంతో దేశం తమకు నమ్మక ద్రోహం చేసిందని వీరు తెగ బాధపడుతున్నారు. వీరి సహజీవన సంసారం ఈ వీడియోలో చూడవచ్చు.