తెలుగు న్యూస్  /  Video Gallery  /   Searching For Alien Life Nasa Working On Swim Robots

NASA SWIM Robots | గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం బరిలోకి స్విమ్మింగ్ రోబోట్స్!

12 July 2022, 15:57 IST

  • ఏలియన్స్ అనేవి ఉన్నాయా? ఇప్పటివరకు దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ అంతరిక్ష పరిశోధనల ప్రకారం ఇతర గ్రహాలలో నీరు ఉండటానికి ఆస్కారం ఉంది. మరి ఉన్నప్పుడు అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉంటుందనేది కొంతమంది ఖగోళశాస్త్రజ్ఞుల వాదన. ఈ నేపథ్యంలో దీని గుట్టు తెలుసుకునేందుకు ఇప్పుడు NASA ప్రయత్నాలు చేస్తుంది. భూమికి ఆవల గ్రహాంతర జీవుల కోసం వెతకడానికి అత్యంత ఆశాజనకమైన ప్రదేశాలపై ప్రయోగాలు చేపట్టనుంది. ఎన్సెలాడస్ వంటి ఇతర ప్రపంచాలపై దట్టమైన మంచుతో నిండిన దిబ్బలు ఉన్నాయి. వీటికింద రహస్య మహాసముద్రాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అక్కడ ఎలాంటి జీవాలు ఉన్నాయో తెలుసుకోవడానికి NASA ఇంజనీర్ ఈతాన్ స్కేలర్ మంచును కరిగించి ద్రవరూప నీటిని జాడ తెలుసుకునే SWIM రోబోట్ కాన్సెప్టును ఆవిష్కరించారు. SWIM అంటే సెన్సింగ్ విత్ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్. ఇవి మైక్రో రోబోట్స్ ఈద గలుగుతాయి, నీటి లోతులను శోధించగలుగుతాయి. మరి నాసా ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.