తెలుగు న్యూస్  /  Video Gallery  /  Monkeypox Spreading Rapidly, More Than 18k Cases Reported Worldwide

Monkeypox | వేగంగా వ్యాపిస్తోన్న మంకీపాక్స్, 18 వేలు దాటిన కేసులు..

28 July 2022, 15:17 IST

  • మంకీపాక్స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75కి పైగా దేశాలలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. లైంగిక కార్యకలాపాల ద్వారా ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా సోకుతుంది. వైరస్ సోకిన వారిలో 98 శాతం మంది మగవారు ఇతర మగవారితో లైంగిక సంపర్కం చేసినవారే. వారి నుంచి ఇతరులకు వ్యాప్తి జరిగింది. అయినప్పటికీ మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు అని WHO చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివకు 18000కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క అమెరికా నుంచే 3000కు పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మంకీపాక్స్ కారణంగా 5 మంది మరణించారు. ఈ మరణాలు ఆఫ్రికా ఖండంలోనే నమోదయ్యాయి. మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి