తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఎవరెస్ట్ శిఖరంపై Iaf వింగ్ కమాండర్ సాహసం.. స్వాతంత్య్రోద్యమ వీరులకు అంకితం!

ఎవరెస్ట్ శిఖరంపై IAF వింగ్ కమాండర్ సాహసం.. స్వాతంత్య్రోద్యమ వీరులకు అంకితం!

31 May 2022, 22:43 IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకగా జరుపుకునేందుకు భారత వైమానిక దళ అధికారి, వింగ్ కమాండర్ విక్రాంత్ ఉనియాల్ ఎవరూ ఊహించని సాహసం చేశారు. ప్రపంచలోనే అత్యంత కఠినమైన, ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అవలీలగా అధిరోహించి భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత జెండాను సగర్వంగా ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు జెండా వందనం సమర్పించారు. మే 21న సాధించిన తన ఈ ఫీట్‌ను భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడి వెలుగులోకి రాని అమరవీరులకు అంకితం ఇచ్చారు. వారు సలిపిన స్వాతంత్ర సంగ్రామాలకు నివాళి అర్పించారు. విక్రాంత్ ఎవరెస్ట్ యాత్ర ఏప్రిల్ 15న నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ప్రారంభమైంది. ఈ IAF అధికారి నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్, ఉత్తరకాశీ, ఆర్మీ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, సియాచిన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ నుంచి పర్వతారోహణలో కఠోర శిక్షణ పొందారు. వింగ్ కమాండర్ విక్రాంత్ భారత వైమానిక దళంలో అర్హత కలిగిన పర్వాతారోహకుడు అని గ్రూప్ కెప్టెన్ సమీర్ గంగ్ఖేద్కర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (రక్షణ) ప్రయాగ్‌రాజ్ అన్నారు.