తెలుగు న్యూస్  /  Video Gallery  /  Combined Oral Contraceptives Don't Raise Risk Of Macromastia In Young Women

COCs and Macromastia | గర్భ నిరోధక మాత్రలతో స్థనాల పరిమాణం పెరుగుతుందా?

03 October 2022, 14:10 IST

  • కౌమారదశలో ఉన్నప్పుడు అమ్మాయిల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అలాగే ఊబకాయం తదితర సమస్యల కారణంగా మహిళలలో రొమ్ముల అభివృద్ధి సాధారణానికి మించి ఎక్కువగా జరగవచ్చు. ఈ పరిస్థితిని వైద్యభాషలో మాక్రోమాస్టియా అంటారు. దీనివల్ల యువతులు శారీరకంగా నొప్పిని అనుభవించటామే కాకుండా మానసిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రిడక్షన్ మామాప్లాస్టీ అనే శస్త్రచికిత్స ద్వారా ఈ పరిస్థితిని పరిష్కరించవచ్చు. ఇదే సమయంలో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు మాక్రోమాస్టియాతో బాధపడే యువతులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, పరిశోధించాల్సిందిగా వైద్యులు సిఫారసు చేశారు. ఈ మేరకు అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్ రెండింటినీ కలిగి గర్భనిరోధక మాత్రలు (COCలు) ఏ విధంగానూ రొమ్ముల అభివృద్ధికి దోహదం చేయవని స్పష్టం చేశారు. వీరి పరిశోధన ఫలితాలు 'ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ' అక్టోబర్ సంచికలో ప్రచురితమయ్యాయి. సాధారణంగా ఈ COC లను కేవలం గర్భనిరోధక ప్రయోజనాలకు మాత్రమే కాకుండా మొటిమలు, రుతుక్రమంలో లోపాలు, ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో సహా యుక్తవయసులో ఉన్నప్పుడు యువతుల్లో కలిగే అనేక రకాల వ్యాధుల చికిత్సకు వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తారు.