తెలుగు న్యూస్  /  Video Gallery  /  Bride's Father Wax Statue Takes Everybody To An Emotional Ride

Bride's Father Wax Statue | ఎంత గొప్ప బహుమానం? హృదయాలను కదిలించిన దృశ్యం!

28 June 2022, 19:54 IST

  • అది ఒక అద్భుత దృశ్యం, ఇంతవరకూ ఏ పెళ్లిలో ఎవ్వరూ అందివ్వని బహుమానం..భావోద్వేగాలతో నిండిపోయింది ఆ పెళ్లిమండపం. ఏ అమ్మాయికైనా పెళ్లి అనేది జీవితంలో అపురూప ఘట్టం. ఒకవైపు కొత్తజీవితం ప్రారంభమవుతుందనే అమితమైన ఆనందం, మరోవైపు తన తల్లిదండ్రులను వీడితున్నాననే దు:ఖం ఈ రెండింటి మేళవింపు వధువుకు ఉంటుంది. అయితే అందరికీ తమకు ప్రత్యేకమైన రోజున తమ తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. కానీ పెళ్లిలో తిరిగిరాడు, లేడనుకున్న తండ్రి కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి విషయంలో అదే జరిగింది. తన పెళ్లిరోజున అచ్ఛంగా తన తండ్రిలాగే ఉన్న మైనపు బొమ్మ కదిలొచ్చింది. అది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి మండంపంలో తన కూతురు పెళ్లిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు కూర్చున్న దృశ్యం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఆ వధువు చెందిన భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఈ ఘటన తెలంగాణలో ఇటీవల ఒక పెళ్లివేడికలో జరిగింది. వధువు సోదరుడు తమ దివంగత తండ్రి మైనపు విగ్రహాన్ని సరిగ్గా పెళ్లి సమయానికి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన చెల్లికి జీవితంలో మరిచిపోలేని గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.