తెలుగు న్యూస్  /  Video Gallery  /  Indian Army Soldiers Carry Pregnant Lady On Stretcher For 3 Kms In Jammu And Kashmir

Kashmir: స్ట్రెచర్‌పై గర్భిణిని మూడు కిలోమీటర్లు మోసిన సైనికులు

10 January 2023, 16:47 IST

  • Indian Army soldiers carry pregnant lady on stretcher: నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ఓ గర్భిణిని స్టైచర్‌పై కిలోమీటర్ల పాటు భుజాల మీద మోసి ఆసుపత్రికి తరలించారు భారత సైనికులు. అత్యంత శీతల పరిస్థితుల్లో మంచు కొండల మధ్య ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళకు ఆపన్న హస్తం అందించారు. జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లోని మూరుమాల గ్రామమైన చోట్‍వాలీ నుంచి స్ట్రెచర్‌పై సుమారు 3 కిలోమీటర్ల పాటు మీమా బేగం అనే ఆ మహిళను జవాన్లు మోసుకొని వెళ్లారు. బారాముల్లా జిల్లా బొనియర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ గర్భిణిని తీసుకెళ్లారు. ఆ గ్రామానికి ఎలాంటి వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవటంతో.. సమాచారం అందిన వెంటనే సైనికులే స్వయంగా ఆ గర్భిణిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. సైనికులకు సలామ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జవాన్లను ప్రశంసిస్తున్నారు.