తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  First Woman Officer At Siachen: అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‍లో తొలి మహిళా ఆఫీసర్..

First woman officer at Siachen: అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‍లో తొలి మహిళా ఆఫీసర్..

04 January 2023, 16:22 IST

  • First woman officer at Siachen: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ‘సియాచిన్’లో తొలిసారి మహిళా అధికారి విధులు చేపట్టారు. భారత ఆర్మీ మొదటిసారి అక్కడ మహిళా అధికారిణిని నియమించింది. కెప్టెన్ శివ చౌహాన్ ఈ ఘనత సాధించారు. ఈనెల 2వ తేదీన ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 15,600 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఆమె విధులు నిర్వర్తించనున్నారు. సైనిక ఇంజినీరింగ్ టీమ్‍ను కెప్టెన్ శివ చౌహాన్ ముందుండి నడిపించనున్నారు. రాజస్థాన్‍కు చెందిన శివ చౌహాన్ బెంగాల్ సాపెర్ ఆఫీసర్ గానూ ఉన్నారు. ఇటీవల సియాచిన్ బ్యాటిల్ స్కూల్‍లో ఇతర సైనికులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు సియాచిన్‍లో సైనిక బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. భారత ఆర్మీ చరిత్రలో ఇది ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. సియాచిన్‍లో తీవ్రమైన శీతల పరిస్థితులు ఉంటాయి. దీన్ని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంగా అభివర్ణిస్తారు. ఇక్కడ విధులు నిర్వర్తించాలంటే సియాచిన్ బ్యాటిల్ ఫీల్డ్ లో కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కఠినమైన పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేశారు కెప్టెన్ శివ చౌహాన్. సియాచిన్‍లో యుద్ధానికి సంబంధించిన ఇంజినీరింగ్ విధులు నిర్వర్తించే టీమ్‍కు ఆమె హెడ్‍గా నియమితులయ్యారు.