తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Marriage In Hospital : ఆసుపత్రిలో పెళ్లి.. అసలేం జరిగిందంటే.. ?

Marriage in Hospital : ఆసుపత్రిలో పెళ్లి.. అసలేం జరిగిందంటే.. ?

24 February 2023, 19:45 IST

  • Marriage in Hospital : ఆసుపత్రిలోనే పెళ్లి జరిగిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివాహ సమయానికి అస్వస్థతకు గురైన వధువు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా... ముహూర్త సమయానికి ఐసీయూలోనే వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడి పల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి పెళ్లి నిశ్చయం అయింది. ఫిబ్రవరి 23న వివాహం జరగాల్సి ఉంది. అయితే ముందు రోజు పెళ్లికూతురు శైలజ అస్వస్థతకు గురైంది. బంధువులు ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పెళ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే వరుడు తిరుపతి ఐసీయూలో ఉన్న వధువు శైలజ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆసుపత్రి నిర్వాహకులే దగ్గర ఉండి పెళ్లి జరిపించారు.