తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ap Government Constructing Tallest Ambedkar Statue In Vijayawada By April 2023

Ambedkar Statue : విజయవాడలో దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం…

02 February 2023, 18:12 IST

  • అంబేడ్కర్ జయంతి నాటికి విజయవాడలో దేశంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏపీఐఐసి ఆధ్వర్యంలో విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ పీఠంతో కలిపి దాదాపు 206 అడుగుల ఎత్తున విగ్రహం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నిర్మించిన విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన విగ్రహంగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. విగ్రహ నిర్మాణం కోసం రూ.268కోట్ల రుపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ చెప్పారు. ఏప్రిల్ 14 నాటికి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవం తర్వాత రెండో దశలో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు. 18ఎకరాల్లో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనంలో పార్క్, మ్యూజికల్ ఫౌంటేన్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.