తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Kakani : కోటంరెడ్డి... జగన్ ఫొటో లేకపోతే మనం జీరోలం

Minister Kakani : కోటంరెడ్డి... జగన్ ఫొటో లేకపోతే మనం జీరోలం

03 February 2023, 17:23 IST

  • Minister Kakani Govardhan Reddy Fires On mla Kotamreddy: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డికి తెలుసని... ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదన్నారు. జరిగింది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదన్న కాకాణి... మ్యాన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ కామెంట్స్ చేశారు. కోటంరెడ్డిని చంద్రబాబు ట్యాప్‌ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ టికెట్‌ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావని.. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఫొటో లేకపోతే మనమంతా జోరోలం అంటూ వ్యాఖ్యానించారు.