తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Drone Spotted In Srikakulam: తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన ‘డ్రోన్‌’

Drone Spotted in Srikakulam: తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన ‘డ్రోన్‌’

03 February 2023, 15:58 IST

  • Fisherman traps Banshee drone: శ్రీకాకుళం జిల్లాలో ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. భావనపాడు సమీపంలో గురువారం మత్స్యకారుల వలకు చిక్కింది. విమానాన్ని పోలిన 10 అడుగుల డ్రోన్‌ లభ్యం కావడంతో మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రోన్ పై టార్గెట్‌ బన్షీ అని స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. దాదాపు 111 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మెరైన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  అయితే ఈ డ్రోన్... మిలిటరీ విభాగానికి చెందినట్లుగా తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లో జనవరి 28న యూజర్‌ ట్రయల్‌లో భాగంగా ఈ ప్రయోగం జరిగినట్లు సమాచారం. ఈ డ్రోన్‌ను ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిసైల్‌ నుంచి కొట్టేందుకు ప్రయత్నించగా.. ఈ ప్రయోగం విఫలమై కూలినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ ఆర్మీ ఆయుధ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రయోగించినట్లు సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.