తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ex Minister Perni Nani Fires On Nara Lokesh Comments In Kuppam Sabha

Perni Nani On Nara Lokesh : లోకేశ్.. ఆ బ్రాండ్లు తెచ్చింది మీ నాన్నారే

28 January 2023, 16:18 IST

  • TDP vs YSRCP: నారా లోకేశ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.కుప్పం సభలో లోకేష్ ప్రసంగంపై స్పందించిన పేర్ని నాని... పోలీస్‌ గన్‌మెన్ల భద్రతతో బతికే మీరు.. పోలీసులను కించపరుస్తూ.. నిర్లజ్జగా మాట్లాడే వారిని ఏమనాలి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. కుప్పం సభలో నారా లోకేష్‌ బరితెగించి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమ్‌ భూమ్, ప్రెసిడెంట్‌ మెడల్, ఆంధ్రగోల్డు బ్రాందీ అమ్ముతున్నారని లోకేష్‌ అంటున్నారని.. వీటి సృష్టికర్త మీ నాన్నారే(చంద్రబాబు) అంటూ పేర్ని నాని సెటైర్లు విసిరారు.