తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  హోలీ వేడుకల్లో డ్యాన్సు చేసిన రఘువీరా రెడ్డి.. మరోసారి వీడియో వైరల్

హోలీ వేడుకల్లో డ్యాన్సు చేసిన రఘువీరా రెడ్డి.. మరోసారి వీడియో వైరల్

09 March 2023, 14:04 IST

  • కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సొంతూరు నీలకంఠాపురంలోనే ఉంటున్నారు. ఇంటి వద్దనే పొలం పనులు, పిల్లలతో ఆడుకోవటం లాంటివి చేస్తున్నారు. తాజాగా హోలీ వేడుకల్లో సందడి చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేశారు. మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్పులు వేశారు.