తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan | పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే..అది పూర్తి చేసేది ఆయన కొడుకే

CM JAGAN | పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే..అది పూర్తి చేసేది ఆయన కొడుకే

24 March 2023, 10:20 IST

పోలవరం అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే పోలవరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే, అది పూర్తి చేసేది ఆయన కొడుకే అని స్పష్టం చేశారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదని విమర్శలు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరానికి ఏం చేశారని ప్రశ్నించారు. దాచుకో, తినుకో, పంచుకో అనేది చంద్రబాబు విధానం అని జగన్ ఆరోపించారు.