తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ap Cm Ys Jagan Review On Women And Child Development

CM Jagan : అంగన్‌వాడీల్లోని పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయండి..

19 October 2022, 16:37 IST

  • cm jagan on women and child development: మహిళా, శిశు సంక్షేమశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రమాణాలతో అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని సూచించారు. అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని సూచించారు. పలు పోస్టుల భర్తీని దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు.సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలన్నారు