తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ysr Kalyanamasthu: తల్లుల ఖాతాల్లోకే కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు - సీఎం జగన్

YSR Kalyanamasthu: తల్లుల ఖాతాల్లోకే కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు - సీఎం జగన్

10 February 2023, 15:47 IST

  • YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa Funds: ‘వైఎస్సార్‌ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం నిధులను విడుదల చేశారు సీఎం జగన్. శుక్రవారం అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.... గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయన్నారు. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. డ్రాపౌట్‌ రేటు తగ్గించడమే లక్ష్యంగా పథకం అమలు అవుతోందని.... ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి అని చెప్పారు. పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదని తెలిపారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉందన్న సీఎం... మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలని ఆకాంక్షించారు. "అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నాం. అమ్మ ఒడి, సంపూర్ణ పౌష్టికాహారం, విద్యాకానుక, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్‌, నాడు-నేడుతోపాటు, నాడునేడులో చివరి కార్యక్రమం ఆరోతరగతి పైన అన్ని క్లాసుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌, 8వ తరగతిలోకి రాగానే వారందరికీ ట్యాబ్స్‌,, బైజూస్‌ కంటెంట్‌ ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ చేస్తున్న మరో కార్యక్రమం కళ్యాణమస్తు, షాదీ తోఫా. గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు, దరఖాస్తు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేదు" అని సీఎం జగన్ చెప్పారు.