తెలుగు న్యూస్  /  Telangana  /  What Are Yellow Orange And Red Alerts Meaning Which Is Used Imd In Winter Season

Winter Season Alerts : శీతకాలంలో ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అర్థమేంటి?

HT Telugu Desk HT Telugu

16 November 2022, 19:20 IST

    • Telangana Weather Update : వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకుని.. భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు తీవ్రమైన చలిగాలుల పరిస్థితులను సూచిస్తూ ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి
తెలుగు రాష్ట్రాల్లో చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి

ఐఎండీ(IMD) ప్రజలను అప్రమత్తంగా చేసేందుకు అలర్టులను ఇస్తుంటుంది. శీతకాలం(Winter)లోనూ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులను జారీ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లోనూ వివిధ ప్రాంతాల్లో ఈ అలర్టులను జారీ చేసింది. అయితే వాతావరణ శాఖ ఇచ్చే ఈ అలర్టులకు అర్థమేంటి?

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

వాతావరణ శాఖ జిల్లాల వారీగా, ఉపవిభాగాల వారీగా, స్టేషన్ల వారీగా హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ అలర్ట్(Alerts) ప్రస్తుత వాతావరణ స్థితిని వివరిస్తుంది. IMD ప్రకారం.. పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి వాతావరణ హెచ్చరికల కోసం కలర్ సంకేతాలు ఉపయోగిస్తారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం గురించి సంబంధిత అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులను ముందుగానే హెచ్చరిస్తారు. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలకు సిద్ధం చేయడంలో వారికి సహాయపడాతాయి ఈ హెచ్చరికలు. .

హెచ్చరిక గురించి చెప్పేందుకు నాలుగు రంగులను ఉపయోగిస్తారు : గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెండ్. ప్రతి దానికి ఓ అర్థం ఉంటుంది. అయితే ఇవి ఇతర కాలాల్లోనూ ఉపయోగిస్తారు. శీతకాలంలోనూ ఇస్తారు. హెచ్చరికలు ప్రతిరోజూ అప్ డేట్ అవుతాయి. ఓ రోజు ఎల్లో అలర్ట్(Yellow Alert) ఇచ్చిన ప్రాంతంలో తర్వాతి రోజు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వొచ్చు. అక్కడున్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా మార్పు ఉంటుంది.

Green Alert : గ్రీన్ (>15°C) అంటే అంతా బాగానే ఉంది. ఎటువంటి సలహా జారీ చేయలేదు. వాతావరణంలో అసాధారణమైన మార్పులేమీ ఉండవు.

Yellow Alert : ఎల్లో అలర్ట్ (>10 నుండి <=15°C) అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో తీవ్రమైన ఇబ్బంది కలిగించే వాతావరణం పరిస్థితులు ఉండవచ్చు. వాతావరణం అధ్వాన్నంగా మారవచ్చని, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చని కూడా ఇది సూచిస్తుంది.

Orange Alert : ఆరెంజ్ అలర్ట్ (>4 నుండి <=10°C) 'సిద్ధంగా ఉండండి' అని హెచ్చరిక. ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణానికి హెచ్చరిక.

Red Alert : రెడ్ అలర్ట్ (<= 4°C) చర్యలోకి రావాలని అధికారులకు విజ్ఞప్తి. వాతావరణం చాలా దారుణంగా ఉందని అర్థం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.

వర్షపాతం, కోల్డ్‌వేవ్, హీట్‌వేవ్ పరిస్థితులతో సహా అన్ని వాతావరణ పరిస్థితులకు రంగు హెచ్చరికలు ఉపయోగిస్తారు.