తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amit Shah Hyd Visit: నేడు హైదరాబాద్ కు అమిత్ షా... నేతలతో కీలక భేటీకి ఛాన్స్!

Amit Shah Hyd Visit: నేడు హైదరాబాద్ కు అమిత్ షా... నేతలతో కీలక భేటీకి ఛాన్స్!

HT Telugu Desk HT Telugu

11 March 2023, 6:25 IST

    • Home Minister Amit Shah News: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ఇవాళ హైదరాబాద్  రానున్నారు. రాత్రి ఇక్కడే బస చేయనున్న ఆయన… ఆదివారం తిరిగి వెళ్తారు.
కేంద్రమంత్రి అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా

కేంద్రమంత్రి అమిత్ షా

Home Minister Amit Shah Hyderabad Visit: ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ కు రానున్నారు. రాత్రి 08:25కి హకీంపేట ఎయిర్‌పోర్టుకి రానున్న ఆయన... ఆదివారం ఉదయం అధికారిక కార్యక్రమమైన సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి కేరళలోని కొచ్చికి వెళ్తారు. నిజానికి ఇది అధికారిక కార్యక్రమం కాగా.... మరోవైపు తెలంగాణలోని తాజా పరిస్థితులపై నేతలతో కీలక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

నిజానికి హైదరాబాద్ పర్యటన భాగంగా... పలువురు మేధావులతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఆదివారం జరగాల్సిన కార్యక్రమానికి శనివారం రాత్రే అమిత్ షా వస్తుండటంతో... పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా... నేతలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లిక్కర్ కేసు నేపథ్యంలో.... రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల పేలుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అయితే వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమలనాథులు... సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత అమిత్ షానే స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాతో తెలంగా బీజేపీ నేతలు భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ బలోపేతం, చేరికలతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత నెలలో కూడా అమిత్ షా హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా కూడా పార్టీలోని నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు.

టాపిక్