తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Announced Exam Dates For Jao And Junior Lecturer Jobs Check Full Details Are Here

TSPSC Exams: అలర్ట్... మరో 2 నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

24 May 2023, 5:30 IST

    • TSPSC Latest Updates: ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరో రెండు ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇందులో కీలకమైన జేఎల్(జూనియల్ లెక్చరర్) పరీక్ష తేదీలు కూడా ఉన్నాయి.
పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Exam Dates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. ఇప్పటికే 30 మందికిపై గా అరెస్ట్ చేయగా… మరోవైపు ఈడీ కూడా విచారిస్తోంది. ఇదిలా ఉంటే పరీక్ష నిర్వహణ తేదీలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని పరీక్షల తేదీలను వెల్లడించగా… తాజాగా మరో రెండు పరీక్షల తేదీలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

ACB Arrested Sub Registrar : భూమి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల లంచం, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

TS Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

Hyderabad Near National Park : హైదరాబాద్ కు 20 కి.మీ దూరంలో నేషనల్ పార్క్, ఈ సమ్మర్ లో ఓ ట్రిప్ వేయండి!

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ), జూనియర్‌ అకౌంట్స్‌ ఆపీసర్‌ (యూఎల్‌బీ), సీనియర్‌ అకౌంట్స్‌ (యూఎల్‌బీ) పోస్టులకు ఆగస్టు 8వ తేదీన సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 78 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు జూనియర్‌ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పేపర్ లీకేజ్ నేపథ్యంలో.... ఈ పరీక్షలను వాయిదా వేశారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పోస్టులకు మొత్తం 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా... 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేస్తారు. అయితే టీఎస్పీఎస్సీ కొత్త తేదీలను ప్రకటించడంతో వీటి భర్తీకి లైన్ క్లియర్ అయింది.

కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం) - 113

కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19

సివిక్స్(పొలిటికల్ సైన్స్) - 56

సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16

కామర్స్ (ఉర్దూ మీడియం) - 07

ఎకనామిక్స్(అర్థశాస్త్రం) - 81

హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17

హిస్టరీ (మరీఠీ మీడియం) - 01

మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09

ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18

జువాలజీ (ఉర్దూ మీడియం) - 18

TSPSC Group 1 Prelims : మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని 36 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. రెండు నెలల పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు మే 25న విచారణ జరపనుంది. ఇక పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ అధికారులకు నోటీసులిచ్చినా తగిన సమాచారం ఇవ్వడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు సహకరించకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా కాన్ఫిడెన్షియల్ ఇన్ ఛార్జి శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారాన్ని రాబట్టింది. ఈ లీకేజీలో శంకర్ లక్ష్మీ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. 2017 నుంచి టీఎస్పీఎస్సీలో శంకర్ లక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. పేపర్ల వాల్యుయేషన్ చేయలేదని పలువురు అధికారులు సిట్ కు తప్పుడు వివరాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో ముఖ్య నిందితురాలు రేణుక రాథోడ్ కు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ సేకరించింది. బుధవారం మరోసారి విచారణకు రావాలని రేణుకకు సిట్ తాజాగా నోటీసులిచ్చింది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 36కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ ను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు.