తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Da : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ పెంపు….

TS Govt DA : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ పెంపు….

HT Telugu Desk HT Telugu

24 January 2023, 9:22 IST

    • TS Govt DA తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం  తీపి కబురు అందించింది. ఉద్యోగులకు డిఏ పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది.  2021 జులై 1 నుంచి  తాజా పెంపుదల వర్తింప చేయనున్నారు.  జనవరి నెల నుంచి పెరిగిన డిఏను జీతం, పెన్షన్లతో కలిపి అంద చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు

TS Govt DA తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిఏ పెంపు.. ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాజాగా ఉత్తర్వులతో డిఏ 2.73శాతం పెరుగుతున్నట్లు చెప్పారు. డిఏ పెరుగుదలతో రాష్ట్రంలోని 4.40లక్షల మంది ఉద్యోగులు, 2.88లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

ఉద్యోగులకు 2.73శాతం డిఏను పెంచుతూ ఒక డిఏ అలవెన్స్‌ విడుదల చేసింది. 2021 జనవరి 1 నుంచి పెంపుదల వర్తింప చేయనున్నారు. జనవరి జీతాలతో పాటు కొత్త డిఏను ఉద్యోగులకు చెల్లిస్తారు. ఈ మేరకు తెలంగాన ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ వరకు పెరిగిన డిఏ బకాయిలను ఉద్యోగలు జిపిఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు.

పెన్షనర్లకు పెరిగిన డిఏ మార్చి నెల నుంచి చెల్లిస్తారు. రెండేళ్ల కాలానికి సంబంధించిన డిఏ బకాయిలను మార్చి నెల నుంచి ఎనిమిది విడతలుగా చెల్లిస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు 90శాతం బకాయిలను మార్చి నెల నుంచి ఎనిమిది సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. తాజా పెంపుదలతో కలిపి ఉద్యోగుల డిఏ 17.29 శాతం నుంచి 20.02 శాతానికి పెరుగుతుంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుదలపై తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీజీవో, టీఎన్జీవో, పిఆర్‌టియూ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు డిఏ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిక కేసీఆర్‌కు ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.