తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Congress Yatra : పాలంపేట నుంచి పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి….

TS Congress Yatra : పాలంపేట నుంచి పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి….

HT Telugu Desk HT Telugu

07 February 2023, 12:58 IST

    • TS Congress Yatra తెలంగాణ ప్రజల అకాంక్షలను కాలరాసి  రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చిన్నాభిన్నం చేశారని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.  హాత్‌ సే హాత్‌ యాత్రలో భాగంగా  వరంగల్ రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత పాలంపేట నుంచి రేేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (twitter)

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TS Congress Yatra తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరింది. రామప్ప ఆలయంలో పూజల అనంతరం పాలంపేట నుంచి ప్రారంభమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. కేశపూర్ మీదుగా మధ్యాహ్న భోజనం విరామ సమయానికి నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు రేవంత్ రెడ్డి యాత్ర చేరుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు

Medak Deaths: మెదక్ జిల్లాలో నీటి వనరుల్లో మునిగి నలుగురు మృతి.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా మారని యువత

Medak Rains : అకాల వర్షానికి వణికిపోయిన ఉమ్మడి మెదక్ జిల్లా - నలుగురు మృతి

Karimnagar Rains: అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం..తడిచిన ధాన్యంతో ఆందోళనలో రైతన్నలు

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌

దేశంలో సమస్యలు పక్కన పెట్టి మోదీ ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించు కోవడం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాశాయని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని, అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.పాదయాత్రలో రెండో రామప్ప నుంచి ములుగు వరకు, రేపు మహబూబాబాద్, గురువారం డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని చెప్పారు.

రాష్ట్రంలో సమస్యల తీవ్రత పట్టించుకోకుండా కేసీఆర్ ఆస్తులు కూడబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.