తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 6, 2024: Musi River Beautification : అమ్మాయిలకు 'మూసీ' నది పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా : సీఎం రేవంత్
Musi River Beautification : అమ్మాయిలకు 'మూసీ' నది పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా : సీఎం రేవంత్
Musi River Beautification : అమ్మాయిలకు 'మూసీ' నది పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా : సీఎం రేవంత్

Telangana News Live October 6, 2024: Musi River Beautification : అమ్మాయిలకు 'మూసీ' నది పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా : సీఎం రేవంత్

06 October 2024, 18:17 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

06 October 2024, 18:17 IST

Telangana News Live: Musi River Beautification : అమ్మాయిలకు 'మూసీ' నది పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా : సీఎం రేవంత్

  • Musi River Beautification : ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు.. మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా సుందరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 17:51 IST

Telangana News Live: Dasara 2024 : గొర్రెలను కొనడానికి సంతకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి!

  • Dasara 2024 : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ దసరా. ఈ పండగ నాడు పల్లెల్లో బొడ్రాయి వద్ద జంతుబలి ఇవ్వడం ఆనవాయితీ. అంతేకాకుండా చాలామంది గ్రూప్‌గా ఎర్పడి జంతు బలి ఇస్తారు. దీంతో గొర్రెలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌ను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 15:03 IST

Telangana News Live: Siddipet : పెళ్లింట విషాదం.. కుమారుడి పెళ్లిరోజే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

  • Siddipet : కొడుకు వివాహం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. బంధువులందరూ రావడంతో ఆ ఇంట సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లో కుమారుడి పెళ్లి. ఇంతలోనే రోడ్డు ప్రమాదం. ఆ యాక్సిడెంట్‌లో పెళ్లి కొడుకు తండ్రి దుర్మరణం పాలయ్యాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళాలు వినిపించాయి.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 13:47 IST

Telangana News Live: Secunderabad to Goa Train : గోవా లవర్స్‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- గోవా ట్రైన్ ప్రారంభం.. టికెట్ ధర ఎంతో తెలుసా?

  • Secunderabad to Goa Train : చాలామందికి గోవా వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ.. బడ్జెట్, ప్రయాణ వివరాలు తెలియక డ్రాప్ అవుతుంటారు. అలాంటి వారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవా వెళ్లే ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాన్ని ఇవాళ ప్రారంభించారు.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 13:39 IST

Telangana News Live: Hyd To Uttarakhand IRCTC Tour: దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

  • Hyderabad To Uttarakhand IRCTC Tour : దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాలు, ఆలయాల సందర్శనకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి 11 రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. తదుపరి టూర్ నవంబర్ 3వ తేదీన ప్రారంభం అవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 12:51 IST

Telangana News Live: TG DSC 2024 Update : ఒక్కొక్కరికి ఒకే పోస్టు.. సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసిన అధికారులు.. 7 ప్రధానాంశాలు ఇవే

  • TG DSC 2024 Update : తెలంగాణ డీఎస్సీ 2024కు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. అయితే.. చాలామంది ఎస్ఏ, ఎస్‌జీటీ పోస్టులకు పరీక్షలు రాశారు. కొంతమంది రెండు పోస్టులకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒకే పోస్టు వచ్చేలా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 12:35 IST

Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 633 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి

  • TG Pharmacist Recruitment 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీన రాత పరీక్షలు ఉంటాయి.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 7:40 IST

Telangana News Live: Karimnagar : ఆస్తి కోసం తల్లిదండ్రులతో కలిసి అన్నను చంపిన తమ్ముడు - డ్రామా ఆడి దొరికిపోయారు..!

  • కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఆస్తి కోసం సొంత అన్నను తమ్ముడు చంపేశాడు. తల్లిదండ్రుల సాయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు తమదైనశైలిలో విచారణ జరపగా.. హత్య విషయం బయటికి వచ్చింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 7:01 IST

Telangana News Live: Sircilla Textile Park : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - నేటి నుంచి టెక్స్ టైల్ పార్క్ బంద్

  • నేటి నుంచి సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ బంద్‌ కానుంది. ఈ మేరకు  వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. గడిచిన 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని.. ఇక నడిపించే పరిస్థితి లేదని వాపోతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 6:40 IST

Telangana News Live: HMWSSB OTS : హైదరాబాద్ నగర ​వాసులకు గుడ్ న్యూస్ - మళ్లీ OTS స్కీమ్ అమలు, ఈ ఛాన్స్ అస్సలు మిస్ కాకండి..!

  • హైదరాబాద్ జలమండలిలో మళ్లీ ఓటీఎస్ స్కీమ్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31 వరకు అమలు చేయనున్నారు.  ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

06 October 2024, 5:17 IST

Telangana News Live: Nalgonda Congress : పాత వర్సెస్ కొత్త లీడర్లు..! నల్గొండ కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు

  • ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల లొల్లి తెరపైకి వస్తోంది. ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ప్రాధాన్యత ఉండటం లేదన్న భావనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి