తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 16, 2024: Ap Tg Ias Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి
AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి
AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

Telangana News Live October 16, 2024: AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

16 October 2024, 21:25 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

16 October 2024, 21:25 IST

తెలంగాణ News Live: AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

  • AP TG IAS Officer Relieve : డీవోపీటీ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ లను ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగుతామని క్యాట్, హైకోర్టులను ఆశ్రయించినా ఊరట దక్కలేదు.దీంతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐఏఎస్ లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 19:38 IST

తెలంగాణ News Live: Document Writer Land Grab : ఫేక్ డాక్యుమెంట్ తో వృద్ధురాలి ఆస్తిపై కన్ను, కొత్తగూడెంలో ఓ డాక్యుమెంట్ రైటర్ నిర్వాకం!

  • Document Writer Land Grab : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ డాక్యుమెంట్ రైటర్ అక్రమాలకు తెరలేపాడు. క్రమవిక్రయాల్లో తలదూరుస్తూ...యజమానులు, కొనుగోలుదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నాడు. కొత్తగూడెం టౌన్ లో ఓ వృద్ధురాలి ఆస్తి కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అతడికి రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 17:18 IST

తెలంగాణ News Live: Medak Road Accident : మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి..!

  • మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్ వాగులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 16:35 IST

తెలంగాణ News Live: TG HC On IAS Petitions : ఐఏఎస్‌లకు దక్కని ఊరట..! పిటిషన్లు డిస్మిస్‌, ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు

  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఏపీలో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 16:19 IST

తెలంగాణ News Live: TG Govt Holiday : విద్యార్థులకు మళ్లీ గుడ్ న్యూస్ - రేపు ఈ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు!

  • తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లాలో రేపు(అక్టోబర్ 17) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 16:00 IST

తెలంగాణ News Live: Rythu Runa Mafi Updates : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్-అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి, త్వరలోనే రైతు భరోసా

  • Rythu Runa Mafi Updates : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 31 నాటికి మిగిలిన రూ.13 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.15 వేలు రైతులకు అందిస్తామన్నారు

పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 15:03 IST

తెలంగాణ News Live: TG Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై అయోమయం..! వచ్చే ఏడాదేనా..?

  • తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై అయోమయం నెలకొంది. కుల గణనకు జీవో 13 విడుదల కావటంతో… కులాల జనాభా లెక్కలు తేలాల్సి ఉంటుంది. ఈ లెక్కలు తేలాకే రిజర్వేషన్ల ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు ఉంటాయా..? లేక వచ్చే ఏడాదే జరుగుతాయా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 14:11 IST

తెలంగాణ News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 2322 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు, పరీక్ష తేదీ కూడా మార్పు

  • TG MHSRB Staff Nurse Recruitment 2024 : నర్సింగ్ పోస్టుల దరఖాస్తులపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియటంతో… తాజాగా పొడిగించింది. అక్టోబర్ 19వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని ప్రకటన విడుదలైంది. మరోవైపు పరీక్ష తేదీ కూడా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 10:01 IST

తెలంగాణ News Live: Pocso Court: ప్రేమ‌పేరుతో బాలిక‌పై అత్యాచారం... నిందితుడికి ప‌దేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు

  • Pocso Court: ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి బాలిక‌పై అత్యాచారం చేసిన నిందితుడికి పోక్సో కోర్టు ప‌దేళ్ల జైలు శిక్ష, జ‌రిమానా విధించింది. బాధితురాలికి రూ.ల‌క్ష‌  ప‌రిహారాన్ని మంజూరు చేశారు.బాలిక‌కు నిందితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఐదేళ్ల క్రితం నాటి  ఘ‌ట‌నపై విచారించి శిక్ష ఖరారు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 9:58 IST

తెలంగాణ News Live: CAT Orders on IAS: ఐఏఎస్‌ల అభ్యర్థన తిరస్కరించిన క్యాట్‌, అధికారుల్ని రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • CAT Orders on IAS: పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా ఉపశమనం కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌ అధికారులకు చుక్కెదురైంది. ఇంట్లో నుంచి పనిచేస్తామని కోరలేరంటూ  అధికారులకు క్యాట్ చురకలు వేసింది. డీఓపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేయడంతో తెలంగాణ అధికారుల్ని ప్రభుత్వం రిలీవ్ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 9:36 IST

తెలంగాణ News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు మరో 15 రోజులు పొడిగింపు

  • Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరోసారి అప్డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 30వ తేదీకి పొడిగించింది. అభ్యర్థులు https://www.braouonline.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 5:33 IST

తెలంగాణ News Live: CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ అవినీతికి ఆధారాలున్నాయంటున్న ఈడీ.. నేడు కోర్టులో కేసు విచారణ

  • CM Revanth Reddy: తెలంగాణలో దాదాపు పదేళ్ల క్రితం వెలుగు చూసిన ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన చార్జిషీట్లో మొదటి నిందితుడిగా ఉన్న రేవంత్ 2019లో విచారణలో తప్పించుకున్నారని ఈడీ చెబుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

16 October 2024, 5:14 IST

తెలంగాణ News Live: Dasara liquor: దసరా మత్తు రూ. 166 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాల జోరు

  • Dasara liquor: కరీంనగర్‌లో దసరా పండుగకు మద్యం జోష్ దద్దరిల్లింది. చిన్న పెద్ద తేడా లేకుండా మద్యం మత్తులో ఊగారు. రోజు 14 కోట్ల విలువ గల మద్యాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తాగేశారు. గత ఏడాదితో పోల్చితే 27 కోట్ల మద్యాన్ని అదనంగా ఈసారి తాగారు. మద్యం తాగడంలో కొత్త రికార్డు సృష్టించారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి