తెలుగు న్యూస్ / తెలంగాణ /
Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - వాగులో పడ్డ కారు, ఏడుగురు మృతి..!
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్ వాగులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గురైన కారు
మెదక్ జిల్లాలోని శివంపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరకపల్లి వద్ద అదుపుతప్పిన ఓ కారు కల్వర్టును ఢీకొని వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ వ్యక్తి సహా నలుగురు మహిళలు ఉండగా.. మరో ఇద్దరు బాలికలు ఉన్నారు.. మృతులంతా పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.